దుబాయ్ లోని ప్రాచీన మందిర వద్ద అగ్ని ప్రమాదం

- February 17, 2020 , by Maagulf
దుబాయ్ లోని ప్రాచీన మందిర వద్ద అగ్ని ప్రమాదం

దుబాయ్: 1950 నాటి బర్ దుబాయ్ లోని హిందూ మందిరం ఎంతో ప్రశిస్థి చెందింది. యూఏఈ లోని ప్రతి హిందూ ఈ మందిరాన్ని సందర్శిస్తారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దుబాయ్ క్రీక్ ఒడ్డున బట్టల షాపుల మధ్య పాత దుబాయ్ ని తలపిస్తూ ఉండే సూక్ నడుమ దివంగత 'షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్' విరాళంగా ఇచ్చిన భూమిలో దీనిని నిర్మించారు. ఇది దుబాయ్ కి వచ్చే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

ఈ మందిరం ఆవరణలో గల షాపులకు సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో వస్తువులను విక్రయించే దుకాణాల యజమాని కుటుంబ సభ్యుడు సోమవారం మాట్లాడుతూ ఎదురుగా ఉన్న ఒక దుకాణంలో మంటలు మొదలయ్యాయని, అయితే ఫైబర్ గ్లాస్ రూఫ్ ద్వారా ఈ దుకాణానికి వ్యాపించిందని చెప్పారు. షాపు మంటల్లో ఉండగా మాకు కాల్ వచ్చిందని, ఇక్కడికి చేరేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాయని అన్నారు.

కాగా, ఆలయానికి మంటలు వ్యాపించలేదనీ, ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని మందిరం మేనేజర్ తెలియజేసారు.

మంటల్ని అదుపులోకి తెచ్చిన సివిల్ డిఫెన్స్ అధికారులు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు మరియు ప్రజల భద్రత కోసం ఈ ప్రాంతంలోని దారులు మరియు బైలెన్లను  మూసివేయబడ్డాయని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com