విక్టరీ వెంకటేష్ తో క్రేజి ప్రాజెక్టు మొదలుపెట్టనున్న రామ్ చరణ్!?
- February 18, 2020
నాన్న కోసం మాత్రమే కొణిదెల బ్యానర్ అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వరుసగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాలు నిర్మిస్తున్నా.. ఈ బ్యానర్ లో వేరే హీరోలతో సినిమాలు తీస్తారా? అన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తే చరణ్ ససేమిరా అన్నారు. అన్నట్టే చేశారు కూడా. `ఖైదీ నెంబర్ 150` తో కొణిదెల కాంపౌండ్ లో చరణ్ తొలి బ్లాక్ బస్టర్ అందుకుని అటుపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ `సైరా నరసింహారెడ్డి`ని అదే బ్యానర్ లో నిర్మించారు. డాడీకి రెండు కానుకలు ఇచ్చారు. కానీ ఇప్పుడు బాణీ మారినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొణిదెల బ్యానర్ లో చిరుకి ఇది మూడో సినిమా. అటుపై ఇక ఇతర హీరోలతోనే కొణిదెల సంస్థ సినిమాలు తీయనుందని అర్థమవుతోంది.
మలయాళం నుంచి `లూసీఫర్`...`డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాల రీమేక్ రైట్స్ ని కొణిదెల అధినేత చరణ్ ఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లలో హీరోలు ఎవరు? అన్నది ఖరారు కావాల్సి ఉంది. అయితే వరుసగా చిరుతోనే ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తుండటం.. రీమేక్ రైట్స్ తీసుకుని వాటిలో హీరోల్ని ప్రకటించకపోవడంతో బయట హీరోలతో చరణ్ సినిమాలు చేయరా? అన్న కొన్ని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో చరణ్ వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తొలిగా చిరంజీవికి సమకాలికుడైన విక్టరీ వెంకటేష్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తొలి సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
అయితే వెంకీ కోసం ఎలాంటి స్క్రిప్ట్ ఫైనల్ చేసారు? దర్శకుడు ఎవరు? అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే చరణ్ `లూసీఫర్`..`డ్రైవింగ్ లైసెన్స్` మాలయాళ చిత్రాల రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు కాబట్టి వాటిలో ఏదైనా స్క్రిప్ట్ ను వెంకీ కోసం లాక్ చేశారా? లేక కొత్త స్క్రిప్ట్ తో చేస్తారా? అన్నది చూడాలి. లూసీఫర్ వెంకీకి పక్కాగా యాప్ట్ అయ్యే స్టోరీ అని ప్రచారం చేస్తున్నా `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్ లో వెంకటేష్ నటించే వీలుందన్న గుసగుసా వినిపిస్తోంది. మరి వెంకీ మైండ్ లో ఏది లాక్ అయ్యిందో? చరణ్ మైండ్ లో ఏముందో తెలియాలి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!