దుబాయ్‌లో ఆధునిక సదుపాయాలతో హిందూ మందిరం

- February 18, 2020 , by Maagulf
దుబాయ్‌లో ఆధునిక సదుపాయాలతో హిందూ మందిరం

దుబాయ్: కొత్తగా 25 వేల చదరపు అడుగుల స్థలంలో మిలియన్ దిర్హాముల భారీ ఖర్చుతో హిందూ దేవాలయం జెబెల్ అలీలో నిర్మించబడుతుంది. సింధి గురు దర్బార్ ఆలయ బోర్డు సభ్యులు గత వారం శంఖుస్థాపన చేశారు. ఈ ఆలయం బర్ దుబాయ్‌లోని మందిరానికి పొడిగింపుగా ఉంటుందని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త మరియు సింధి గురు దర్బార్ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ ప్రకటించారు.

ఈ ఆలయాన్ని జెబెల్ అలీలోని గురు నానక్ దర్బార్ ప్రక్కనే నిర్మిస్తారు. దీంతో చర్చి, సిక్కు గురు నానక్ దర్బార్ మరియు హిందూ మందిరం ఒకేచోట ఉండనున్నందుకు ఈ ప్రాంతం దుబాయ్‌లోని బహుళ-మత కారిడార్‌గా ప్రఖ్యాతిగాంచుతుందని ష్రాఫ్ వివరించారు. సింధి గురు దర్బార్ కోసం భూమిని దుబాయ్ ప్రభుత్వం 2018 బహుమతిగా ఇచ్చింది ఆలయ నిర్మాణం 2022 లో పూర్తవుతుందని భావిస్తున్నారు. కట్టనున్న ఈ భవనం లో రెండు అంతస్తులు, రెండు బేస్మెంట్ అంతస్తులు మరియు భారీ పార్కింగ్ సదుపాయం ఉంటుంది.

ఆలయ రూపకల్పన మరియు నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ అనే భారతీయ నిర్మాణ సంస్థ ఈ ఆలయ రూపకల్పనను అందించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200 కి పైగా దేవాలయాలను రూపొందించింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దుబాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి అనుమతులు వచ్చాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com