ట్రంప్ పుణ్యమా అని 'యమున' కు కొత్త పుంతలు
- February 19, 2020
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో యూపీలోని తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో తాజ్‌మహల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్‌మహల్‌కు ఒకవైపున యమనానది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలో కలుషితమైన నీరు ప్రవహిస్తుందనే విషయం విదితమే. అదేవిధంగా యమునా నది నీటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ట్రంప్ వచ్చే సమయంలో యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బులంద్ షహర్‌లోని గంగా నది నుంచి 500 క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడిచిపెట్టనున్నారు. ఫలితంగా యమునా నది చక్కగా పారుతున్నట్లు కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా యమునలో ప్రవాహం పెరిగితే దుర్వాసన అంతగా వ్యాపించకుండా ఉంటుందని అనుకుంటున్నారు. భారత్‌లో ట్రంప్ ఈనెల 23 నుంచి 26 వరకూ పర్యటించనున్నారు. అధిక సమయం ఢిల్లీలోనే గడపనున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..