మళ్లీ తెరుచుకున్న బర్ దుబాయ్ ఆలయ తలుపులు..మహాశివరాత్రి పూజలకు సిద్ధం

- February 19, 2020 , by Maagulf
మళ్లీ తెరుచుకున్న బర్ దుబాయ్ ఆలయ తలుపులు..మహాశివరాత్రి పూజలకు సిద్ధం

బర్ దుబాయ్ లోని హిందూ ఆలయం మహాశివరాత్రి పూజలకు సిద్ధమైంది. సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంబంధించటంతో ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. అయితే..36 గంటల్లోనే ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. భక్తులను దర్శనాలను అనుమతిస్తున్నట్లు ఆలయ సంరక్షకుడు, వ్యాపారవేత్త వాసు ష్రఫ్ తెలిపారు. ఆలయం ఉన్న స్ట్రీట్ లో ఎలక్ట్రిసిటీ, వాటర్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.

ఆలయం ఉన్న భవనంలోని ఓ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అయితే..ఆలయం మొదటి అంతస్తులో ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు. కింది అంతస్తులోని రెండు దుకాణాల్లో మాత్రం నష్టం వాటిల్లింది. ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోగానే పై అంతస్తులో ఉన్న ఆలయ సిబ్బందిని హుటాహుటిన భవనం ఖాళీ చేయించామని వాసు ష్రఫ్ వివరించారు.

ఇదిలాఉంటే వచ్చే శుక్రవారం మహాశివరాత్రి ఉండటంతో ఆలయాన్ని శుభ్రపరిచి మంగళవారం సాయంత్రం నుంచి మళ్లీ దర్శనాలను పునరుద్దరించారు. శివరాత్రి నాటికి దాదాపు 60 వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బర్ దుబాయ్ లోని ఈ ఆలయం అక్కడి షాపులకు ప్రధాన ఆదాయ వనరు. దీంతో పండగ సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం..ఆలయం మూతపడటంతో దుకాణదారులు ఆందోళన చెందారు. అయితే..అధికారులు స్పందించి పనులు వేగంగా చేయటంతో గుడి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు థ్యాంక్స్ చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com