ఆ రైలు లో శివునికి సీటు...క్లారిటీ ఇచ్చిన పియూష్ గోయల్
- February 19, 2020
ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో దేవుడికి ఓ బెర్త్ రిజర్వ్ చేశారని వచ్చిన కథనాలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తాము ఏ దేవుడి కోసం రైలులో రిజర్వేషన్ చేయించలేదని స్పష్టం చేశారు. మతం ఆధారంగా ఇలాంటివి జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం జరగబోదని చెప్పారు. రైలు ప్రారంభం రోజు కావడంతో పూజలు చేయడం కోసం మాత్రమే చిత్రపటాన్ని వాటిని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.
కాాగా ఆదివారం ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఓ బెర్తును ఆలయంలా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పించారు. దేవుడి కోసం ప్రత్యేకించి సీటును కేటాయించడం ఏంటన్ని ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను కూడా ప్రయాణించే సమయంలో సాయిబాబా, గణేశుని ఫొటోలు తీసుకెళ్తానని చెప్పారు. 'చాలామంది ముస్లింలు రైల్లో ప్రయాణిస్తూ నమాజ్‌లు చేసుకుంటారు. వాళ్లని కూడా ఎవరూ ఆపడం లేదుకదా ' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!