ఆ రైలు లో శివునికి సీటు...క్లారిటీ ఇచ్చిన పియూష్ గోయల్

- February 19, 2020 , by Maagulf
ఆ రైలు లో శివునికి సీటు...క్లారిటీ ఇచ్చిన పియూష్ గోయల్

ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో దేవుడికి ఓ బెర్త్ రిజర్వ్ చేశారని వచ్చిన కథనాలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తాము ఏ దేవుడి కోసం రైలులో రిజర్వేషన్ చేయించలేదని స్పష్టం చేశారు. మతం ఆధారంగా ఇలాంటివి జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం జరగబోదని చెప్పారు. రైలు ప్రారంభం రోజు కావడంతో పూజలు చేయడం కోసం మాత్రమే చిత్రపటాన్ని వాటిని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.

కాాగా ఆదివారం ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఓ బెర్తును ఆలయంలా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పించారు. దేవుడి కోసం ప్రత్యేకించి సీటును కేటాయించడం ఏంటన్ని ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను కూడా ప్రయాణించే సమయంలో సాయిబాబా, గణేశుని ఫొటోలు తీసుకెళ్తానని చెప్పారు. 'చాలామంది ముస్లింలు రైల్లో ప్రయాణిస్తూ నమాజ్‌లు చేసుకుంటారు. వాళ్లని కూడా ఎవరూ ఆపడం లేదుకదా ' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com