అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు

- February 19, 2020 , by Maagulf
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు

లక్నో: అయోధ్యలో త్వరలోనే రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ బుధవారంనాడు తెలిపారు. దీనికి ఎలాంటి అవరోధాలు ఉండవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసిందని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ కోసం బుధవారం సాయంత్రం ట్రస్టు సమావేశమవుతోందని ఆయన తెలిపారు. 'సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రబుత్వానికి నా ధన్యవాదాలు. సాధ్యమైనంత త్వరగా రామాలయ నిర్మాణం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుంది' అని దినేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేశారు. తొలి సమావేశంలో ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరుగనుంది. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ, హోం శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం ఆలయ నిర్మాణం ప్రారంభించే తేదీని ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com