'కట్-కాపీ- పేస్ట్' ఆవిష్కర్త 'లారీ టెస్లర్' కన్నుమూత!
- February 20, 2020
'కట్- కాపీ- పేస్ట్' ఈ మూడూ లేకుండా కంప్యూటర్‌లో ఏ పనీ చేయలేమనే విషయం విదితమే. ఈ 'కట్- కాపీ- పేస్ట్' ఆవిష్కర్త అయిన 'లారీ టెస్లర్' పర్సనల్ కంప్యూటర్ విప్లవకర్త అయిన స్టీవ్ జాబ్స్‌కు దక్కినంత ఆదరణ చూరగొనలేదు. అయితే టెస్లర్ అందించిన 'కట్- కాపీ- పేస్ట్' తదితర ఆవిష్కరణలు ఎంతగానో ఉపయుక్తమవుతున్నాయి. లారీ టెస్లర్(74) ఈరోజు కన్నుమూశారు. న్యూయార్క్‌లో జన్మించిన ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివారు. 1973లో ఆయన జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. 'కట్- కాపీ- పేస్ట్' ఆవిష్కర్త ప్రయాణం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యింది. టెస్లర్‌కు జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో టిమ్ మాట్ అనే కంప్యూటర్ నిపుణుని సహాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ తయారు చేశారు. దీనిని మరింతగా అభివృద్ధి పరచి 'కట్- కాపీ- పేస్ట్' ను రూపొందించారు. లారీ టెస్లర్ అమెజాన్, యూహూ తదితర ప్రముఖ సంస్థల్లోనూ పనిచేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..