భీష్మ:రివ్యూ

- February 21, 2020 , by Maagulf
భీష్మ:రివ్యూ

భీష్మ:రివ్యూ
నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: మహతి సాగర్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకుడు: వెంకీ కుడుముల
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
 

నితిన్ కు ఏడాదిన్నరగా సినిమా విడుదల లేదు. తన గత మూడు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో నిలిచాడు నితిన్. మరి ఈ నేపథ్యంలో విడుదలైన చిత్రం భీష్మ. విడుదలకు ముందే డీసెంట్ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
భీష్మ ఆర్గానిక్స్ అనే సంస్థను స్థాపించిన భీష్మ (అనంత్ నాగ్) పెళ్లి చేసుకోని బ్రహ్మచారి. సంస్థను నడిపించే తన వారసుడి కోసం చూస్తుంటాడు. మరోవైపు భీష్మ (నితిన్) విచిత్ర పరిస్థితిలో ఏసిపి దేవా (సంపత్ రాజ్)ను కలుస్తాడు. అతని కూతురు (రష్మిక)ను ప్రేమిస్తాడు. భీష్మ (అనంత్ నాగ్), భీష్మ (నితిన్) ను చూసి ఇంప్రెస్ అయ్యి 30 రోజులకు సిఈవో చేస్తాడు. భీష్మ (నితిన్), భీష్మ (అనంత్ నాగ్)ను ఎలా ఇంప్రెస్ చేస్తాడు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
నితిన్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ముఖ్యంగా డ్యాన్స్ ల విషయంలో నితిన్ ఇంప్రెస్ చేస్తాడు. కామెడీ పరంగానూ అ.. ఆ తర్వాత ఆ రేంజ్ ఔట్పుట్ ఇచ్చాడు. రష్మిక క్యూట్ గా అనిపిస్తోంది. ఆమె రోల్ బాగుంది. సంపత్ రాజ్, బ్రహ్మాజీ పాత్రలు కామెడీని పంచుతాయి. వెన్నెల కిషోర్ కు మరో పాత్ర పడింది. అతను చెలరేగిపోయాడు. హెబ్బా పటేల్ కు చిన్న పాత్రే దక్కింది. విలన్ గా చేసిన జిస్సు సేన్ గుప్తా ఓకే.

సాంకేతిక వర్గం:
మహతి సాగర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో ఉపయోగపడుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి కలర్ఫుల్ గా ఉండి మెప్పిస్తుంది. ఎడిటింగ్ స్మూత్ గా ఉంది. వంకలు పెట్టడానికి ఏం లేదు. వెంకీ కుడుముల మరోసారి కామెడీ తన ప్రధాన బలమని నిరూపించాడు. రైటింగ్ ప్రధాన బలంగా నిలిచింది. డైరెక్షన్ కూడా ఓకే. లవ్ స్టోరీ ఇంకొంచెం బాగా తీసి క్లైమాక్స్ ను ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే భీష్మ మరో లెవెల్ లో ఉండేది.

విశ్లేషణ:
కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేని భీష్మ,స్క్రీన్ ప్లే పరంగా మెప్పిస్తుంది. లైట్ హార్ట్డ్ మూమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీతో నింపేసాడు దర్శకుడు. అసలు కథ చెప్పాల్సిన చోట దర్శకుడు కొంత తడబడ్డాడు. సెకండ్ హాఫ్ లో చివరి 30 నిముషాలు కొంత నెగటివ్ గా అనిపిస్తాయి. ఏదేమైనా మొత్తానికి భీష్మ మెప్పిస్తుంది. సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ కు మరో బ్లాక్ బస్టర్ భీష్మ రూపంలో దొరికినట్లే.

 

ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్

ఎడిటర్: నవీన్ నూలి

కళా దర్శకుడు: సాహి సురేష్

స్టంట్స్: వెంకట్

సాహిత్యం: శ్రీ మణి & కసర్ల శ్యాం

--మాగల్ఫ్ రేటింగ్: 3.25 / 5.0

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com