వైష్ణవ్ తేజ్ ను చిత్రసీమలోకి ఆహ్వానించిన రామ్ చరణ్.. 'ఉప్పెన' టీమ్ కు శుభాకాంక్షలు
- February 22, 2020
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కజిన్ వైష్ణవ్ తేజ్ ను ఆహ్వానించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతను హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో, "బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. బుచ్చిబాబు సానా, కృతి శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని పోస్ట్ చేశారు.
ఈ మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్ లో హీరోయిన్ కృతి శెట్టిని ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ప్రధాన తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







