షార్జా:బ్రైబ్ కేసులో తనపై ఆరోపణలను తప్పుబట్టిన మాజీ మున్సిపల్ ఎంప్లాయ్

- February 22, 2020 , by Maagulf
షార్జా:బ్రైబ్ కేసులో తనపై ఆరోపణలను తప్పుబట్టిన మాజీ మున్సిపల్ ఎంప్లాయ్

షార్జా:మాజీ మున్సిపల్ ఎంప్లాయ్ ఒకరు dh20,000 లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై షార్జా కోర్టులో ఆసక్తికర విచారణ జరిగింది. బ్రైబ్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి మున్సిపల్ శాఖలో మాజీ ఉద్యోగి. అయితే..ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు కావాల్సిన అనుమతి ఇప్పించేందుకు ఆ మాజీ ఉద్యోగి తన దగ్గర dh20,000 బ్రైబ్ అడిగినట్లు ఫిర్యాదుదారుడు కంప్లైంట్ చేశాడు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి షార్జా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సమయంలో తన దగ్గర dh20,000 లంచం డిమాండ్ చేసినట్లు కోర్టులో ఫిర్యాదుదారుడు చెప్పగా..నిందితుడు మాత్రం తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని న్యాయస్థానానికి వివరించాడు. తాను ఉద్యోగం నుంచి తప్పుకొని చాలా కాలం అయ్యిందని...అసలు తనపై కంప్లైంట్ చేసిన ఫిర్యాదుదారుడిని ఇంతవరకు చూడనే లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. మరోవైపు నిందితుడి తరపు వాదనలు వినిపించిన లాయర్ కూడా ఫిర్యాదుదారుడి ఆరోపణలను తప్పుబట్టారు. తన క్లైయింట్ అమాయకుడని అన్నారు. పోలీసుల విచారణ సమయంలో, పబ్లిక్ ప్రాసిక్యూషన్  దర్యాప్తులోనూ ఫిర్యాదుదారుడు పొంతన లేని సమాధానాలు చెప్పటాన్ని బట్టి నిజా నిజాలు గ్రహించాలని కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. పోలీసుల ఎంక్లైరీలో నిందితుడికి Dh30,000 లంచం ఇచ్చినట్లు చెప్పాడని, కానీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో మాత్రం Dh20,000 లంచం ఇచ్చినట్లు చెప్పాడని గుర్తు చేశారు. పొంతన లేని సమాధానాల బట్టి ఫిర్యాదుదారుడి ఆరోపణల్లో నిజం లేదని పరిగణించాలని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న షార్జా కోర్టు తదుపరి విచారణను మార్చి 3వ తేదికి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com