లక్ష్మీ పార్వతి తెరంగేట్రం..రిలీజ్ కు రెడీ అవుతున్న"రాధాకృష్ణ"
- February 23, 2020
హరిని ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు డమరుకం శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో నిర్మాతలు పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానురు లు కలిసి నిర్మించిన చిత్రం రాధాకృష్ణ. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో వుంది. నందమూరి తారక రామారావు గారి సతీమణి, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డైనమిక్ లేడి అండ్ లీడర్ లక్ష్మి పార్వతి గారు మెదటి సారిగా ఈ చిత్రం లో కీలక పాత్ర లో నటిస్తున్నారు. అంతే కాకుండా ఏవిధమైన అండదండలు లేకుండా సినిమా పై మక్కువతో సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో వీరితో పాటు అనురాగ్, ముస్కాన్ సేతి లు జంట గా నటించారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలను చూపిస్తూనే పల్లె వాతావరణం లోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథను అందరికి నచ్చేలా అందరూ మెచ్చేలాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.
అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవలే దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరణ జరిగిన ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను అతి త్వరలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని నిర్మాతలు తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: టి.సురేందర్ రెడ్డి
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
కొరియోగ్రాఫర్: స్వర్ణ
ఆర్ట్; సాయి మణి
ఎడిటింగ్: ప్రభు
దర్శకత్వం: ప్రసాద్ వర్మ
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







