మనామ: మాస్క్ ప్రైజ్ రేట్ల ట్యాంపరింగ్..మూడు మెడికల్ స్టోర్స్ సీజ్
- February 26, 2020
కరోనా వైరస్ భయంతో ఇటీవలి కాలంలో మాస్క్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు మాస్క్ రేట్లను ట్యాంపర్ చేస్తున్నారు కొందరు మెడికల్ స్టోర్స్ యజమానులు. మాస్క్ రేట్లను బ్లాక్ చేయటంగానీ, ఎక్కువ ధరలకు విక్రయించిన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. మెడికల్ స్టోర్స్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు..బుదైయ, రిఫా, మొహారక్‌లో మూడు స్టోర్స్ లో మాస్క్ ప్రైజ్ ట్యాంపర్ చేసినట్లు గుర్తించారు. ఆ మూడు స్టోర్స్ ను సీజ్ చేశారు. కరోనా వైరస్ భయం నేపథ్యంలో మాస్క్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసింది. అయితే..మాస్క్ లను బ్లాక్ చేయటం ద్వారా ప్రజల్లో ఆందోళన రేపి మార్కెట్లో రేట్లను పెంచుతున్నాయని అధికారులు తెలిపారు. ఎవరైనా రేట్లను ట్యాంపర్ చేసినా..మెడికల్ గూడ్స్ బ్లాక్ చేసినా కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







