దోహ: కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- February 26, 2020
దోహ:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఖతార్ హెల్త్ మినిస్ట్రి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కోవిడ్-19 సోకిన వ్యక్తులను గుర్తించేందుకు కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన పరికరాలను హెల్త్ మినిస్టర్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ హెచ్ఇ అబ్దుల్లా బిన్ నాజర్ తుర్కి అల్ సుబాయ్ ఆమెకు విమానాశ్రయంలోని మెడికల్ ఎక్విప్మెంట్, థర్మల్ స్క్రీనింగ్ గురించి వివరించారు. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ చెకప్ చేసే మెడికల్ స్టాఫ్ ఎంతటి సంసిద్ధతతో ఉందో కూడా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హెల్త్ మినిస్టర్..వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించి వారి సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైఅలర్ట్ పాటించాల్సిన ప్రాముఖ్యతను అధికారులకు వివరించారు. చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, సింగపూర్, జపాన్, ఇటలీ వంటి కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతాయన్నారు ఆమె.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!