కువైట్ లో ఇక ఆదాయం.. అమ్మకం పన్నులు
- January 21, 2016
అంతర్జాతీయంగా చమురు ఆదాయాలు పతనం కావడంతో ఇంధన మరియు శక్తి పై ఇచ్చే భారీ రాయతీలను తగ్గించనున్నట్లు కువైట్ ఎమిర్ షేఖ్ సబహ్ అహ్మద్ అల్ సబహ్ చెప్పారు. రాయతీలు ఎత్తివేయడంతో పెట్రోల్, విద్యుత్, నీటి ధరలు పెరగనున్నట్లు తెలిపారు. ఇతర సేవల కొరకు రాయతీలను తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన కువైట్ స్థానిక దిన పత్రికలకు ఈ సమాచారం తెలిపారు. 6 దేశాల గల్ఫ్ దేశాల సమాఖ్యలో కువైట్ దేశం మాత్రమె ఇప్పటి వరుకు పెట్రోల్, విద్యుత్ పై ధరలు పెంచాలేదనే విషయం గ్రహించాలని అన్నారు. సౌదీ అరేబియా, యు.ఎ.ఇ. ఖతర్, ఒమాన్ ,బహేరిన్ దేశాలు పెట్రోల్, విద్యుత్ ధరలు సరెళీకరణ చేయడం ద్వారా బిలియన్ల కొద్ది డాలర్లను ఆదా చేసినట్లు తెలిపారు.తాము సైతం తప్పని పరిస్థితులలో ధరలను పెంచేందుకు యత్నిస్తున్నట్లు ఎమిర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంత్రి ఆల్ సలెహ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాము ఇక ప్రజా సేవల వ్యయాన్ని పెంచి , ప్రభుత్వం ఇచ్చే రాయతీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు,
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







