ఎన్ఐఏ అధికారులు అధీనంలో ఏడుగురు ఐసిస్ సానుభూతిపరులు
- January 22, 2016
ఒకే రోజు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏడుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లో నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు.మరోవైపు కర్ణాటక పోలీసులు, ఎన్ఐఏ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను శుక్రవారం ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేశారు. నజ్ముల్ హుడా, హస్సేన్ లను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నజ్ముల్, హస్సేన్ కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు కొన్ని రోజులు వీరిద్దరిపై నిఘా ఉంచారు. రిపబ్లిక్ వేడుకల్లో దాడులు చేసేందుకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో వీరిని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.బజ్పేలో నివాసముంటున్న నజ్ముల్ హుడా-మంగళూర్ లో కెమికల్ ఇంజినీరింగ్, తుంకుర్ కు చెందిన సయ్యద్ హుస్సేన్- బెంగళూరులో డిప్లొమా చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఒక ఐసిస్ సానుభూతి పరుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని మంబై ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!









