మార్చి 2 నుండి కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం
- February 27, 2020తనదైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో నటించి మెప్పించిన కిరణ్ అబ్బవరం హీరోగా తన రెండవ చిత్రం ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటంగ్ ని మార్చి 2 నుండి ప్రారంభిస్తున్నారు. టాక్సీవాలా లాంటి సూపర్‌హిట్ చిత్రం లో నటించి యువత మనసులు గెలుచుకున్న ప్రియాంక జవాల్కర్ కిరణ్ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 మ్యూజిక్ దర్శకుడు చేతన్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీధర్ గడె దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అతి ముఖ్యమైన పాత్ర లో సాయికుమార్ నటిస్తున్నారు. రాజావారి రాణిగారు చిత్రం ద్వారా పరిచయమైన కిరణ్ పల్లెటూరి ప్రేమికుడిగా కనిపించాడు. ఇప్పడు ఈ చిత్రం కొసం తనని తాను మరో కొత్త కొణం లో చూపించటానికి స్టైలింగ్ మార్చుకున్నాడు. ఈ చిత్రం అందరిని అలరించేలా వుంటుందని నిర్మాతలు తెలిపారు..
నటినటులు.. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ , సాయికుమార్ తదితరులు నటించగా..
సంగీతం.. చైతన్ భరద్వాజ్
బ్యానర్.. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు.. ఎలైట్ గ్రూప్
దర్శకత్వం.. శ్రీధర్ గాదె
తాజా వార్తలు
- అబుధాబిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
- ట్యాంక్‌బండ్ వద్ద భారీ కార్నివాల్
- ఒలింపిక్ రేసులోకి బాక్సర్ అమిత్ పంగల్ …
- 3 గ్లోబల్ హెల్త్ అవార్డులను అందుకున్న ఒమన్
- పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నారా? అనుమతి, ప్రక్రియ, వ్యాక్సిన్ల వివరాలు
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- ఖతార్ లో 1.2 మిలియన్ చదరపు మీటర్ల గ్రీనరీ పునరుద్ధరణ
- కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్‌గా షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా
- సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారం..ఇద్దరు అరెస్ట్
- దుబాయ్ లో సింగిల్ యూజ్ బ్యాగ్‌లపై నిషేధం ప్రారంభం