విశాఖలో పర్యటించి తీరుతా:చంద్రబాబు
- February 28, 2020
అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తానని మండిపడ్డారు. విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానానికి వెళ్లాలని తెదేపా నిర్ణయించింది. నిన్నటి విశాఖ పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడం ఏంటని నిలదీశారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న చంద్రబాబు.. వైకాపా కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆక్షేపించిన ఆయన.. పోలీసుల సహకారంతోనే వైకాపా నిరసనలు అని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!