ఇరాన్‌ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

- February 28, 2020 , by Maagulf
ఇరాన్‌ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

తెహ్రాన్‌ : కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారినపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌ ఆరోగ్య శాఖ ఉపమంత్రి హరిర్చికి కరోనా వైరస్‌ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు సోకడంతో ఇరాన్‌ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. ఈ రిపోర్టు శనివారానికి వచ్చే అవకాశం ఉందని ఫరీబా తెలిపారు. ఇరాన్‌లో మొత్తం 240 మందికి కరోనా వైరస్‌ సోకగా 26 మంది మఅతి చెందారు. ఫిబ్రవరి 19 న ఒక్కరోజే కరోనా వైరస్‌ సోకినట్లు 106 కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో ఈ వైరస్‌ బారినపడి 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 వేల మంది చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com