'హిట్':రివ్యూ
- February 28, 2020
కాస్ట్ : విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజి, భాను చందర్, హరితేజ
మ్యూజిక్ : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : మణికంథన్
కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ : శైలేష్
ప్రొడ్యూసర్ : ప్రశాంతి, నాని
బ్యానర్ : వాల్ పోస్టర్ ప్రొడక్షన్స్
ఈనగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాలతో అలరించిన విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా హిట్. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ సినిమాను శైలేష్ డైరెక్ట్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న విక్రం (విశ్వక్ సేన్) కు లేడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రీతి (రుహాని శర్మ) మిస్సింగ్ కేస్ డీల్ చేస్తాడు. ఈ కేసు గురించి క్లూస్ వెతుకుతున్న టైంలో అతనికి మరో మిస్సింగ్ కేసు గురించి తెలుస్తుంది. ఈ రెండు కేసులను విక్రం ఎలా సాల్వ్ చేశాడు. తను అభిమానించిన ప్రీతి మళ్లీ విక్రం ను కలిసిందా..? ఈ మిస్సింగ్ ల వెనుక ఉన్న విలన్ ను విక్రం ఎలా కనిపెట్టాడు..? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో కథ ఎంత పాతదైనా సరే దాన్ని ఎంత ఎంగేజింగ్ గా నడిపించాడు అన్నదే పరిగణలోకి తీసుకుంటారు. హిట్ సినిమాలో కూడా దర్శకుడు కథ రొటీన్ గా రాసుకున్నా ఆ కథను రివీల్ చేసేందుకు రాసుకున్న కథనం బాగుంది. సినిమా అంతా సస్పెన్స్ మోడ్ లో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు జస్ట్ ఓకే అనేలా ఉన్నా సెకండ్ హాఫ్ మొదలవడం ల్యాగ్ అనిపించినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి.
కథ, కథనాల్లో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగిందని చెప్పొచ్చు. లీడ్ ఆర్టిస్టుల దగ్గర నుండి మంచి అవుట్ పుట్ తీసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు. అయితే కథ కన్నా కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. కథనంలో దర్శకుడు టెక్నికల్ యాస్పెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అది ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పొచ్చు.
సినిమా చివరి వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేయడం కొందరికే సాధ్యం. హిట్ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కు సినిమా నచ్చుతుందా అంటే డౌటే అంటున్నారు. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ నచ్చే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతుంది. నాని నిర్మాతగా ఇదో మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు. నిర్మాతగా నాని సక్సెస్ అయ్యాడు.
నటీనటుల ప్రతిభ :
విశ్వక్ సేన్ నటుడిగా పరిణితి చెందాడని చెప్పొచ్చు. విక్రం పాత్రలో అతని నటన మెప్పిస్తుంది. సీరియస్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషన్ ఇన్ని యాంగిల్స్ లో కూడా విశ్వక్ ది బెస్ట్ ఇచ్చాడు. రుహాని శర్మ నటన ఇంప్రెస్ చేస్తుంది. మురళి శర్మ, బ్రహ్మాజి, భాను చందర్, హరితేజ వారి పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఈ సినిమాకు మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తో సినిమా మూడ్ ను ఆడియెన్స్ కు కలిగేలా మెప్పించాడు. ఇక వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు చలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. బిజిఎం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. కథ, కథనాల్లో దర్శకుడు శైలేష్ తన ప్రతిభ చాటుకున్నాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే హిట్ కు చాలా ప్లస్ అయ్యింది. నాని, ప్రశాంతి ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
విశ్వక్ సేన్
ఇన్వెస్టిగేషన్ సీన్స్
సస్పెన్స్
క్లమాక్స్
మైనస్ పాయింట్స్ :
మిస్సింగ్ కమర్షియల్ వాల్యూస్
అక్కడక్కడ ల్యాగ్ అవడం
చివరిగా :
హిట్.. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్..!
--మాగల్ఫ్ రేటింగ్ : 2.5/5
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







