దిర్హమ్స్ వెదజల్లితే... మీ ఇంటే వద్దకే బ్రిటిష్ వీసా
- January 22, 2016
మీ ఇంటి నుంచో లేక కార్యాలయం నుంచో ఇక బ్రిటిష్ వీసా ను పొందే సౌకర్యాన్ని బ్రిటిష్ రాయబార కార్యాలయం ప్రారంభించింది. ఈ సేవల్లో భాగంగా ఇక పాస్‌పోర్ట్ అధికారులే నేరుగా మీ వద్దకు వచ్చి తదుపరి లంఛనాలను వారే చక చక పూర్తి చేసుకొంటారు. అయెతే, ఈ మర్యాదలన్నీ పొందాలంటే ఒక్కో వ్యక్తి 4,500 దినార్లను ' గిరాకే సేవ ' కోసం చెల్లించాలి. తద్వారా అన్ని రకాల వీసాలను పొందడమే కాక ' దీర్ఘ కాల యు.కె వీసా 'ను వారు పొందేందుకు అర్హులవుతారు. ఈ డిమాండ్ సేవను పొందగోరే ధరఖాస్తుదారుడు తొలుత " [email protected] " అధికారులకు ఒక ఈ -మెయిల్ ను పంపించాల్సి ఉంది. అందుకు స్పందించిన అధికారులు తాము వచ్చేతెదే , సమయం ధరఖాస్తుదారునికి తెలియచేస్తారు. ఆ ప్రకారం వచ్చి బయో మెట్రిక్ నమోదు, దరఖాస్తు తామే స్వయంగా నింపి ఆ ప్రక్రియలను పూర్తిచేస్తారు. తర్వాత 3 నుంచి 5 రోజుల లోపు సంబంధిత ధరఖాస్తుదారుడు పాస్‌పోర్ట్ అధికారులు , వీసా కేంద్రం చుట్టూ ప్రదక్షణలు చేయకుండానే వీసాను దర్జా గా తీసుకోవచ్చును. అంతే కాక ఒకవేళ ధరఖాస్తుదారుడు తనకు 24 గంటలలో వీసాను పొందాలని ఆశిస్తే , అదనంగా మరో 2,600 దినార్లను చెల్లించి ఆ వీసాను సైతం పొందవచ్చు. అలాగే ' 6 నెలల బహుళ ప్రవేశ వీసా ' కోసం 450 దినార్లను వారికి చెల్లించితే సరిపోతుంది. ఈ తరహా వీసా సేవలను వేగంగా అందచేసేది ప్రపంచంలోనే తొలిసారిగా ' యు ,కె ' మాత్రమె చేయడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ధరఖాస్తుదారునికి ఈ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రిటిష్ కాన్సల్ జెనెరల్ పాల్ ఫాక్స్ దుబాయ్ లో మాట్లాడుతూ , మేము అనేక పరిశోధనల అనంతరం ఈ వేగవంతమైన వీసా విధానం అమలు లోనికి తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







