కళ్యాణకృష్ణ దర్శకత్వంలో అఖిల్
- January 22, 2016
'సోగ్గాడే చిన్నినాయన'గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. హీరోగానే కాక నిర్మాతగానూ నాగార్జునకు ఈ మూవీ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి... దీంతో ఈ యువదర్శకుడికి అఖిల్ రెండో సినిమా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారట కింగ్ నాగార్జున. అయితే ఈ సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. అఖిల్ మొదటి సినిమా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో... రెండో సినిమా విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు నాగార్జున. ప్రపంచాన్ని కాపాడే రక్షకుడు తరహా పాత్రలు కాకుండా.. ప్రస్తుతానికి హీరోయిన్ను కాపాడగలిగే పాత్రలైతే అఖిల్‌కు చాలంటున్నాడట నాగ్. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం రెండు ప్రేమకథలు సిద్ధమయ్యాయట.ప్రస్తుతం వీటి బాధ్యత సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణకృష్ణపై ఉంచారట నాగార్జున. దీంతో ఈ రెండింటికి స్క్రీప్ట్ వర్క్ చేస్తున్నాడట ఈ యువ దర్శకుడు. ఈ రెండింటి స్క్రీప్ట్ వర్క్ పూర్తయ్యాక వీటిలో నాగ్ ఏది అంగీకరిస్తాడో.. ఆ సినిమాలో అఖిల్ నటిస్తాడట. ఈ రెండు సినిమాలూ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కావటం విశేషం..
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







