సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలో ఐఎస్ఐఎస్ దాడి
- January 22, 2016
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.సోమాలియా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. మొగాదీషు నగరంలోని సముద్ర తీరంలో లిడో బీచ్ లో షెబబ్ రెస్టారెంట్ ఉంది. గురువారం రాత్రి ఈ రెస్టారెంట్ లో చాల మంది భోజనం చేస్తున్నారు.అదే సమయంలో రెస్టారెంట్ ను చుట్టుముట్టిన ఉగ్రవాదులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. ఆ ఘటన అత్యంత పాశవికమైన చర్యగా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ అభివర్ణించారు.ఈ దాడికి తామే భాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (పిబాబ్) ప్రకటించింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని, ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నామని పోలీసు అధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







