దిర్హమ్స్ వెదజల్లితే... మీ ఇంటే వద్దకే బ్రిటిష్ వీసా

- January 22, 2016 , by Maagulf
దిర్హమ్స్ వెదజల్లితే... మీ ఇంటే వద్దకే బ్రిటిష్ వీసా

మీ ఇంటి నుంచో లేక కార్యాలయం నుంచో ఇక బ్రిటిష్ వీసా ను పొందే సౌకర్యాన్ని బ్రిటిష్ రాయబార కార్యాలయం ప్రారంభించింది. ఈ సేవల్లో భాగంగా ఇక పాస్పోర్ట్ అధికారులే నేరుగా మీ వద్దకు వచ్చి తదుపరి లంఛనాలను వారే చక చక పూర్తి చేసుకొంటారు. అయెతే, ఈ మర్యాదలన్నీ పొందాలంటే ఒక్కో వ్యక్తి  4,500 దినార్లను ' గిరాకే సేవ ' కోసం  చెల్లించాలి.  తద్వారా అన్ని రకాల వీసాలను  పొందడమే కాక ' దీర్ఘ కాల  యు.కె వీసా 'ను  వారు   పొందేందుకు అర్హులవుతారు. ఈ  డిమాండ్ సేవను పొందగోరే ధరఖాస్తుదారుడు తొలుత "  [email protected] "   అధికారులకు ఒక ఈ -మెయిల్ ను పంపించాల్సి ఉంది. అందుకు స్పందించిన అధికారులు తాము వచ్చేతెదే , సమయం ధరఖాస్తుదారునికి తెలియచేస్తారు. ఆ ప్రకారం వచ్చి బయో మెట్రిక్ నమోదు, దరఖాస్తు  తామే స్వయంగా నింపి ఆ ప్రక్రియలను పూర్తిచేస్తారు. తర్వాత 3 నుంచి 5 రోజుల లోపు సంబంధిత  ధరఖాస్తుదారుడు పాస్పోర్ట్ అధికారులు , వీసా కేంద్రం  చుట్టూ ప్రదక్షణలు చేయకుండానే వీసాను దర్జా గా  తీసుకోవచ్చును. అంతే కాక ఒకవేళ ధరఖాస్తుదారుడు తనకు 24 గంటలలో వీసాను పొందాలని ఆశిస్తే , అదనంగా మరో 2,600 దినార్లను చెల్లించి ఆ వీసాను సైతం పొందవచ్చు. అలాగే ' 6 నెలల బహుళ ప్రవేశ  వీసా ' కోసం 450 దినార్లను వారికి చెల్లించితే సరిపోతుంది.  ఈ తరహా వీసా సేవలను వేగంగా అందచేసేది  ప్రపంచంలోనే తొలిసారిగా ' యు ,కె ' మాత్రమె చేయడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ధరఖాస్తుదారునికి ఈ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రిటిష్ కాన్సల్ జెనెరల్ పాల్ ఫాక్స్ దుబాయ్ లో మాట్లాడుతూ , మేము అనేక పరిశోధనల  అనంతరం ఈ వేగవంతమైన వీసా విధానం అమలు లోనికి తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com