దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు

- January 22, 2016 , by Maagulf
దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు

దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఐఏకు సమాచారం అందింంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ముగ్గురు, హైదరాబాద్‌లో నలుగురు, బెంగళూరులో ఆరుగురు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను భగ్నం చేయాలనే ఐస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ సైనిక స్థావరంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దిల్లీ నగరంలోకి ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులు కారు డ్రైవర్‌ను చంపి పఠాన్‌కోట్‌ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com