జిసిసి పటిష్టం - ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధం
- January 22, 2016
సాధించిన విజయాలు, అభివృద్ధి, యూనిటీ ఇవన్నీ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ పటిష్టతకు నిదర్శనాలని జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ అతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని చెప్పారు. అబుదాబీలో జరిగిన ఓ కార్యక్రమంలో అల్ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. జిసిసి ఎలాంటి ఛాలెంజెస్‌ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎమిరేట్స్ సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన అల్ జయానీ, ఇరాన్, యెమెన్ సమస్యలతోపాటు, తీవ్రవాద ముప్పును గురించీ మాట్లాడారు. ఇరాన్ గురించి మాట్లాడుతూ రీజియన్‌లో ఆయుధాల వాడకాన్ని తగ్గించడం, అలాగే మాస్ డిస్ట్రక్షన్ లేకుండా చేయడం వంటివి ప్రాధాన్యతాంశాలని అన్నారు. ఇరాన్ పొరుగుదేశమనీ, ఇరాన్ ప్రజలతో సఖ్యత చారిత్రాత్మకమని, జిసిసి దేశాల నిర్ణయం ప్రకారం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ఆయన అన్నారు. యెమెన్ పునర్నిర్మాణంలో జిసిసి పాత్ర అమోఘమైనదని అల్ జయానీ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







