వీసాల్ని రద్దు చేసిన టూరిజం మినిస్ట్రీ
- February 29, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూరిస్ట్ వీసాల జారీని రద్దు చేసింది. చైనా, ఇటలీ, కొరియా, జపాన్, మలేసియా, సింగపూర్ మరియు కజికిస్తాన్ దేశాల నుంచి వచ్చేవారికి టూరిస్ట్ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ అలర్ట్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దేశాలకు గతంలో మంజూరు చేసిన వీసాల్ని కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలు మంజూరు చేసినవారికి మాత్రం కొనసాగిస్తామని అన్నారు. అయితే, వారికి మక్కా మరియు మదీనాలను సందర్శించేందుకు అవకాశమివ్వరు. పౌరుల భద్రతే ముఖ్యమనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన ప్రతి చర్యనూ తీసుకుంటామని అధికారులు వివరించారు. కాగా, వీసాల రద్దు అనేది తాత్కాలికమేనని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







