విద్యుత్ సమస్యతోనే హోటల్లో ప్రమాదం
- January 22, 2016
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంపై దుబాయ్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. విచారణలో ఎక్కడా పేలుడు పదార్థాలుగానీ, గ్యాస్ లేదా పెట్రోల్ మంటలు సంభవించినట్లు ఆధారాలు దొరకలేదనీ, పూర్తిగా విద్యుత్ సమస్య కారణంగానే మంటలు సంభవించి ఉండొచ్చని దుబాయ్ పోలీస్ చీఫ్ ఖామిస్ మట్టర్ అల్ మజైనా చెప్పారు. 63 అంతస్తులు గల అడ్రస్ హోటల్ కమ్ రెసిడెన్షియల్ బ్లాక్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. కొందరికి గాయాలు మాత్రం అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి పలువురు చిత్రీకరించిన వీడియోలను సాక్ష్యంగా తీసుకుని, పరిశీలించారు. వీటిల్లో ప్రమాదం అనంతరం మండుతున్న చిన్న చిన్న వస్తువులు కిందకి జారాయనీ, అవి ఫైర్ వర్క్స్ కావని అధికారులు తేల్చారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







