దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు
- January 22, 2016
దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఏకు సమాచారం అందింంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్లీలో ముగ్గురు, హైదరాబాద్‌లో నలుగురు, బెంగళూరులో ఆరుగురు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను భగ్నం చేయాలనే ఐస్ఐఎస్ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలే పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సైనిక స్థావరంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దిల్లీ నగరంలోకి ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులు కారు డ్రైవర్‌ను చంపి పఠాన్‌కోట్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







