కరోనా ఎఫెక్ట్:హోటల్ ఓనర్స్ కు స్ట్రిక్ట్ ఆర్డర్స్
- March 02, 2020
కువైట్:ప్రపంచ దేశాలపై మహమ్మారిలా విరుచుకుపడుతున్న కరోనా వైరస్ తమ దేశంలో ప్రభావం చూపించకుండా కువైట్ ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. వైరస్ స్ప్రెడ్ అయ్యే ఏ చిన్న ఛాన్స్ ఉన్నా కఠిన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అన్ని హోటల్స్, రెస్ట్రారెంట్స్, కెఫ్స్, కెఫెటేరియాస్ కు హెల్త్ ఇన్ స్ట్రక్షన్స్ ఇష్యూ చేసింది. హోటల్ స్టాఫ్ కి తప్పకుండా ఫేస్ మాస్క్స్ తో పాటు గ్లౌవ్స్ అందివ్వాలని సూచించింది. అలాగే కస్టమర్లకు అవసరమైన సానిటరీ మెటీరియల్స్ ని అందుబాటులో ఉండచాలని ఆథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ ఆదేశించింది. హోటల్ తో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి తీరాలని ఎక్స్ ట్రార్డినరీ ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది. హెటల్స్, కేఫ్స్ లో తనఖీలు నిర్వహిస్తామని, తమ సూచనలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







