ఢిల్లీ:నిర్భయ దోషులకు మళ్లీ ఉరి వాయిదా..కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

- March 02, 2020 , by Maagulf
ఢిల్లీ:నిర్భయ దోషులకు మళ్లీ ఉరి వాయిదా..కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

ఢిల్లీ:నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దోషుల ఉరిశిక్ష అమలుపై క్షణ క్షణం పరిణామాలు మారిపోయాయి. ముందుగా  నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఆ వెంటనే పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఈ మెర్సీ పిటిషన్ వేశారు. దీంతో రాష్ట్రపతి ముందు దోషులలో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున  తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ దోషులను ఉరితీయరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు తాజా ఆదేశాలతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది.  ఇదిలాఉంటే..నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పదే పదే వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యమంటూ ఆమె కంటతడి పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com