దుబాయ్:ఈ-కామర్స్ వెబ్ సైట్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- March 03, 2020
దుబాయ్:డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లో కస్టమర్స్ మోసపోకుండా యూఏఈ మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. యూఏఈ పరిధిలోని ఈ కామర్స్ వెబ్ సైట్స్ అన్నింటిని ఆయా ఎమిరాతి కంట్రీస్ లోని ఎకనామిక్ డిపార్మెంట్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. జీసీసీ 15వ జీసీసీ కన్సూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ సమావేశంలో మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.హసీం అల్ నువామీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ-కామర్స్ బిజినెస్ ను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావటం ద్వారా వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించటంతో డిజిటల్ ఫ్లాట్ ఫాంపై బిజినెస్ చేసే వారికి మరింత బాధ్యతను పెంపొందించటమే తమ లక్ష్యమని వివరించారు. 2022 నాటికి ఈ-కామర్స్ బిజినెస్ Dh99.45 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కన్సూమర్స్ రైట్స్ కాపాడటంలో భాగంగా డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లపై ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!