కరోనా కంట్రోల్ లోనే ఉంది..ప్రెస్ మీట్ లో కువైట్ హెల్త్ మినిస్ట్రి వెల్లడి
- March 04, 2020
కువైట్:కువైట్ లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోనే ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ప్రెస్ మీట్ లో హెల్త్ మినిస్ట్రి అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైన అల్ ముదఫ్ వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో 56 మందికి కరోనా పాజిటీవ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. అయితే..కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కువైట్ చేపట్టిన చర్యలను ఈజిప్ట్ మీడియా విమర్శించటాన్ని ఆమె తప్పుబట్టారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈజిప్ట్ నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించామని వివరించారు. ఈ ఆంక్షలు ఒక్క ఈజిప్ట్ కు మాత్రమే కాదని సిరియా, ఇండియా, బంగ్లాదేశ్ ఫ్లైట్స్ పై కూడా ఆంక్షలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈజిప్ట్ విమానాలను అడ్డుకోవటంగానీ, అక్కడి నుంచి తమ వారిని వెనక్కి రప్పించటంగానీ చేయటం లేదని..వైరస్ పోరాటంలో తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..