దుబాయ్ లో గుండెపోటుతో కార్మికుడు మృతి

- March 05, 2020 , by Maagulf
దుబాయ్ లో గుండెపోటుతో కార్మికుడు మృతి

దుబాయ్:తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, భీంగల్ మండలం, గోనుగోప్పల గ్రామానికి చెందిన బారుకుంట శంకర్ అనే కార్మికుడు మూడు రోజుల క్రితం ఆకస్మికంగా గుండేపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని మృతుని యొక్క సన్నిహితులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ కి తెలపడంతో వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి కంపెనీ పూర్తి సహకారం తో మృతదేహాన్ని ఈ రోజు ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన T NRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి వేడుకుంటున్నాము. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం పంపేందుకు కృషిచేసిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ కి మృతుని యొక్క సన్నిహితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా  ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్,పార్శ రఘు, కొత్తపల్లి దశరథం, బార్కుంట రాజు, బాబా గౌడ్ ,ప్రభాకర్, బోడ రాజ్ కుమార్, రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు పాల్గోన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com