పవిత్ర మక్కా మసీదులో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ అనౌన్స్
- March 06, 2020
సౌదీ అరేబియా:పవిత్ర మక్కా, మదీనా మసీదులో ప్రార్ధనలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మదీనాలో ప్రవక్త మసీదుతో పాటు మక్కా మసీదుల ఓపెనింగ్, క్లోజింగ్ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ రెండు మసీదులను సాయంత్రం ప్రార్ధనల తర్వాత గంట తర్వాత మూసివేయనున్నారు. అలాగే ఉదయం ప్రార్ధనకు గంట ముందు మసీదులోకి భక్తులను అనుమతించనున్నారు. అలాగే పవిత్ర కాబాతో పాటు సఫా, మార్వాహ్ మధ్య సయీకి భక్తులను ఎవర్ని అనుమతించబోమని వెల్లడించారు. ఉమ్రా ప్రార్ధనలపై నిషేధం ఎత్తివేసే వరకు మసీదులో అంతర్గత ప్రార్ధనలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవిత్ర మక్కా, మదీన మసీదుల్లో ప్రార్ధన విరామ సమయంలో క్లీన్ నెస్ మేయిన్టేన్ చేయటంతో పాటు స్టెరిలైజేషన్ చేసేందుకే ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ అనౌన్స్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే ఎడాదిలో నిర్వహించే పవిత్ర ఉమ్రా యాత్రపై సౌదీ ప్రభుత్వం మార్చి 4 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా జీసీసీలో ఆరు గల్ఫ్ దేశాలతో పాటు మక్కా, మదీనా సందర్శించాలనుకునే ఇతర దేశాల భక్తుల వీసాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం