తెలంగాణ:మహిళా దినోత్సవం..అవార్డులు ప్రకటన
- March 07, 2020
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొత్తం 20 రంగాల్లో 30 మంది మహిళలకు అవార్డులు ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారిలో వ్యవసాయం, సామాజిక సేవ, వ్యాపార, జర్నలిజం, నృత్యం, పెయింటింగ్, విద్య, వైద్య, జానపదం, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. జానపద కళారంగంలో మంగ్లీ సత్యవతి, సోషల్ మీడియా విభాగంలో మిల్కూరి గంగవ్వ, వ్యవసాయ రంగంలో బెగారి లక్ష్మమ్మ, జర్నలిజంలో జీ నిర్మల రెడ్డి తో పాటు మరికొందరు అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీక్షిత, స్విమ్మింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన శ్యామల గోలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఎంపికైన 30 మంది మహిళలకు ప్రభుత్వం మార్చి 8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం)న రూ. 1 లక్ష నగదు రివార్డుతో సత్కరించనుంది.జానపద సవ్వడి..మంగ్లీతన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్న మంగ్లీ సత్యవతి..గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా మనందరికి సుపరిచితురాలు. 'మాటకారి మంగ్లీ' ప్రోగ్రామ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో పాటలు పాడారు. మంగ్లీ నాన్న బాలు నాయక్ జానపద పాటలు పాడేవారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...