మంచు విష్ణు సినిమా బడ్జెట్..చేతులెత్తేసిన తనికెళ్ళ భరణి..ఐటీ అధికారులకు షాక్

- March 08, 2020 , by Maagulf
మంచు విష్ణు సినిమా బడ్జెట్..చేతులెత్తేసిన తనికెళ్ళ భరణి..ఐటీ అధికారులకు షాక్

 

మంచు విష్ణు కెరీర్ లో ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. విష్ణు చివరగా ఓటర్, అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం విష్ణు కన్నప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో విష్ణు తన కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నాడు. త్వరలో ప్రారంభించబోతున్న భక్త కన్నప్ప చిత్రంపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భక్త కన్నప్ప చిత్రాన్ని మొదటగా తనికెళ్ళ భరణి దర్శత్వంలో తెరకెక్కించాలని అనుకున్నాం. కథ కూడా రెడీ చేయించాను.

భక్త కన్నప్ప చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని కోరిక. హాలీవుడ్ రైటర్ ని కూడా ఈ చిత్రం  కోసం తీసుకున్నాము. ప్రీప్రొడక్షన్ లో బడ్జెట్ అంచనా వేస్తే 95 కోట్ల వరకు అవసరం అనిపించింది.  ప్రస్తుతం బడ్జెట్ తగ్గించే పనిలో ఉన్నాం అని మంచు విష్ణు తెలిపాడు.

ఈ చిత్ర బడ్జెట్ గురించి తెలిశాక భరణి అంకుల్ నేను హ్యాండిల్ చేయలేను అన్నారు. అందువల్ల హాలీవుడ్ వ్యక్తిని దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాను. కొందరు టాలీవుడ్ ప్రముఖ దర్శకులని అడిగితే బడ్జెట్ లో 30 శాతం రెమ్యునరేషన్ అడిగారు. కుదరదని వాళ్ళు పరోక్షంగా చెప్పినట్లు అనిపించింది. అది నాకు నచ్చలేదు అని విష్ణు తెలిపాడు.

వంద కోట్లతో సినిమా చేసేంత డబ్బు మీకు లేదా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం నా మార్కెట్ అంత లేదు. భక్త కన్నప్ప విజయం సాధిస్తే వస్తుంది. అయినా నా దగ్గర అంత డబ్బు లేదు. నేను కట్టే ఐటీ రిటర్న్స్ చూసి  ఐటి అధికారులు కూడా షాకయ్యారు. మీ రిటర్న్స్ ఇంత తక్కువగా ఉన్నాయేంటి అని అడిగారు.

నా సినిమాలు ఆడితేనే కదా నా దగ్గర డబ్బు ఉంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు. కానీ ప్రజలు మాత్రం నా  దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని అనుకుంటుంటారు. వాస్తవానికి నా దగ్గర అంత డబ్బు లేదు అని విష్ణు తెలిపాడు.

రాజకీయంగా మంచు ఫ్యామిలీ స్టాండ్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటన్నింటినీ పక్కన పెడితే నా మొదటి ప్రాధాన్యత నా భార్య విరోనికా, ఫ్యామిలీకే. ఆ తర్వాతే మిగిలినవి. అటు చంద్రబాబు, ఇటు జగన్ కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నా అంకులే. నా భార్య విరోనికా, జగన్ అన్న ఇద్దరూ బంధువులు. నా భార్యకు జగన్ అన్న అవుతారు. కాబట్టి జగన్ అన్నే నాకు ముఖ్యం. బాలయ్యతో కూడా మంచి రిలేషన్ ఉంది అని విష్ణు చెప్పుకొచ్చాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ వైఎస్ జగన్ కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com