కరోనావైరస్ కారణంగా అభిమానులు లేకుండా బహ్రెయిన్ ఎఫ్ 1 రేసు

- March 08, 2020 , by Maagulf
కరోనావైరస్ కారణంగా అభిమానులు లేకుండా బహ్రెయిన్ ఎఫ్ 1 రేసు

బహ్రెయిన్‌:బహ్రెయిన్‌లో నిర్వహిస్తున్న ఫార్ములా వన్ గ్రాన్‌ప్రీని వీక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా వన్ మొదటి సీజన్‌లో రెండో రౌండ్ పోటీలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు మార్చి 22న జరగాల్సి ఉంది. అయితే.. బహ్రెయిన్‌లో ఇప్పటి వరకూ 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు పోటీ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫుట్‌బాల్, గోల్ఫ్, స్కీయింగ్, మారథాన్‌లు మరియు ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లు అన్నీ వాయిదాపడ్డాయి.'ఇంతటి భారీ ఈవెంట్‌తో వేల సంఖ్యలో విదేశీ ప్రేక్షకులు, బహ్రెయిన్ పౌరులు ఒకే వేదిక వద్దకు రావడం ఈ పరిస్థితుల్లో మేం సరైనదిగా భావించడం లేదు.' అని పోటీ నిర్వహకులు వ్యాఖ్యానించారు.ఏప్రిల్ 19 న జరగాల్సిన షాంఘైలో చైనా గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటికే వాయిదా పడింది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com