మస్కట్:త్వరలో ఎలక్ట్రానిక్ ఎయిర్ వే..ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్స్ బంద్
- March 08, 2020
మస్కట్:ఈ-పాలసీలో భాగంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పేపర్ ఎయిర్ వే బిల్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓన్లీ ఎలక్ట్రానిక్ ఎయిర్ వే బిల్స్ ను మాత్రమే అనుమతించనున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా, క్వాలీటీ సర్వీస్ అందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇక నుంచి క్లైయింట్స్ అందరూ ఎయిర్ వే బిల్స్ ను ఎలక్ట్రానికల్ గానే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ తెలిపింది. ఒరిజినల్ వే బిల్స్ లో నమోదు చేసే డేటా వివరాలన్నింటిని డిజిటల్ గా నమోదు చేయాలని వివరించింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఏప్రిల్ 1 నుంచి పేపర్ డాక్యుమెంట్లను కూడా అనుమతించరు. ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేట్ చేసే కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్వోపీ సూచించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!