హైదరాబాద్: రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రవాసీయులకు దక్కని ఊరట..ఊసులేని NRI పాలసీ
- March 09, 2020
తెలంగాణ వలస జీవితాలకు రూ.1.82 లక్షల బడ్జెట్ దారి చూపించలేకపోయింది. ఉపాధి కోసం వలస బాట పడుతున్న బతుకులు పెట్రోల్ బాయ్, దుబాయ్ అన్నట్లు మారింది ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ తాజా బడ్జెట్ లో మాత్రం గల్ఫ్ లోని ప్రవాసీయుల ఆకాంక్షలను మరోసారి విస్మరించారు. నిజానికి మన ఆర్ధిక వ్యవస్థలో గల్ఫ్ లోని ప్రవాసీయుల పాత్ర ఎంతో కీలకమైనది. ఇతర దేశాల్లోని ఎన్ఆర్ఐల కంటే గల్ఫ్ వెళ్లిన ప్రవాసీయుల నుంచి రాష్ట్ర ఖజానాకు ఎక్కువ నిధులు చేరుతున్నాయి. మిలియన్ల మంది కార్మికుల పంపుతున్న నిధులతో రెమిటెన్స్ లు కూడా పెరుగుతున్నాయి. అయినా.. తమను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ప్రవాసీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గల్ఫ్ కంట్రీస్ లోని ప్రవాసీయుల నుంచి రెమిటెన్స్ లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న మాట ఎంత నిజమో..ఇక్కడి వలస కార్మికుల కష్టాలు కూడా అంతే నిజం. నిర్మాణ రంగంలో, పెట్రోల్ బావుల్లో, డ్రైవర్లు, డోమస్టిక్ వర్కర్లుగా ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలస వచ్చిన వారు పైసా పైసా కూడబెట్టి పంపుతున్న సొమ్ము అంది. అయితే..ఆరోగ్య కారణాల వల్లో, ప్రమాదాల కారణంగానో ఒకవేళ గల్ఫ్ లో తెలంగాణ పౌరులు చనిపోతే వాళ్ల మృతదేహాలను సొంతూర్లకు పంపించటం కూడా గగనమే అవుతోంది. కార్మికులకు ఉపాధి రక్షణ లేకుండా పోతోంది. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారి కష్టాలు వర్ణణాతీతం. పని ఇచ్చిన షేక్ లు కష్టాలు పెట్టినా, ఒంటెల కాపాలదారులుగా వాళ్ల జీవితాలు ఎడారి పాలవుతున్నా వారిని షేక్ ల చెర నుంచి విడిపించేందుకు సరైన యంత్రాంగం అంటూ లేకుండా పోయింది. అందుకే గల్ఫ్ లోని ప్రవాసీయుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది.
ఎలక్షన్ల సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ఆర్ఐ పాలసీ పట్ల సానుకూల ప్రకటనలు చేసింది. అంతేకాదు..గల్ఫ్ లోని తమ రాష్ట్ర కార్మికుల కోసం కేరళ ప్రభుత్వం
చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొంత మేర ఆశాజనకంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికార బృంధాన్ని కేరళకు అధ్యయనం కోసం పంపించారు. దీనికితోడు కొందరు శాసన సభ్యులను గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి, స్వయంగా తానే ప్రవాసులను కలుస్తానని సీఏం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో తమ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందని ప్రవాసులు ఆశించారు. కానీ, బడ్జెట్ లో మాత్రం గల్ఫ్ కంట్రీస్ ప్రవాసీయుల ఊసే కనిపించలేదు. వివిధ సంక్షేమ పథకాలకు రూ. 40 వేల కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం..రాష్ట్ర ఖజానాకు చేదోడుగా ఉంటున్న తమ సంక్షేమాన్ని విస్మరించటం పట్ల ప్రవాసీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!