కరోనావైరస్ కారణంగా అభిమానులు లేకుండా బహ్రెయిన్ ఎఫ్ 1 రేసు
- March 08, 2020
బహ్రెయిన్:బహ్రెయిన్‌లో నిర్వహిస్తున్న ఫార్ములా వన్ గ్రాన్ప్రీని వీక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా వన్ మొదటి సీజన్లో రెండో రౌండ్ పోటీలకు బహ్రెయిన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు మార్చి 22న జరగాల్సి ఉంది. అయితే.. బహ్రెయిన్‌లో ఇప్పటి వరకూ 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు పోటీ నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫుట్‌బాల్, గోల్ఫ్, స్కీయింగ్, మారథాన్లు మరియు ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లు అన్నీ వాయిదాపడ్డాయి.'ఇంతటి భారీ ఈవెంట్‌తో వేల సంఖ్యలో విదేశీ ప్రేక్షకులు, బహ్రెయిన్ పౌరులు ఒకే వేదిక వద్దకు రావడం ఈ పరిస్థితుల్లో మేం సరైనదిగా భావించడం లేదు.' అని పోటీ నిర్వహకులు వ్యాఖ్యానించారు.ఏప్రిల్ 19 న జరగాల్సిన షాంఘైలో చైనా గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటికే వాయిదా పడింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..