సౌదీ రాజు సల్మాన్‌ క్షేమమే..

- March 09, 2020 , by Maagulf
సౌదీ రాజు సల్మాన్‌ క్షేమమే..

రియాద్: సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు సౌదీ రాయల్‌ కోర్టు వెల్లడించింది. సల్మాన్‌ మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ సల్మాన్‌ తాజా ఫోటోలను విడుదల చేసింది. అతను ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది. అదే రాజకుటుంబానికి చెందిన రాజకుమారుడి అరెస్టుతో సల్మాన్‌ ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వచ్చాయి. అయితే తండ్రి మద్దతుతో కీలక బాధ్యతలు చేపట్టిన రాజకుమారుడు, సన్నిహితులు మాత్రం సల్మాన్‌కు మద్దతు తెలపకపోవడంతో పాటు తిరుగుబాటుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ కుమారుడితోపాటు మరో ఇద్దరిని రాజద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజకుటుంబంలోని వారితోపాటు రాజుకు అత్యంత సన్నిహితులను కూడా అరెస్టు చేయడం ద్వారా ఎవరైనా తప్పుచేస్తే అధికారం కోల్పోవాల్సివస్తుందనే సంకేతాలను రాజకుటుంబం పంపింది.

అయితే ఈ సమయంలోనే 84ఏళ్ల వయసున్న సౌదీ రాజు సల్మాన్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. వీటిని ఖండించిన రాయల్‌ కోర్టు.. సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని స్పష్టం చేసింది. తాజాగా రాజు సల్మాన్‌ అధికారికంగా ఇద్దరు దౌత్య అధికారులను కలుసుకున్న ఫోటోలను విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com