3 ఏళ్ళ చిన్నారికి సోకిన కరోనా వైరస్‌

- March 09, 2020 , by Maagulf
3 ఏళ్ళ చిన్నారికి సోకిన కరోనా వైరస్‌

ఇటలీ నుంచి వచ్చిన మూడేళ్ళ చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. ఇటలీ నుంచి కోచికి దుబాయ్‌ మీదుగా ఆ కుటుంబం ప్రయాణించినట్లు తెలుస్తోంది. మార్చి 7న కోచిలో ఈ కుటుంబానికి స్క్రీనింగ్‌ చేశారు. కరోనా గుర్తించగానే, ఐసోలేషన్‌ వార్డ్‌కి తరలించారు. ఎర్నాకులం మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో చిన్నారికి వైద్య చికిత్స అందుతోంది. కేరళలో ఇది ఆరవ కరోనా వైరస్‌ కేసు కావడం గమనార్హం. అయితే, చిన్నారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించినా, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి వుంది. ఈ కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణించినవారు, వారితో కలిసినవారు ఐసోలేషన్‌లో వుండాలనీ, వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ వైద్యులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com