మస్కట్‌లో ఇండియన్‌ ఎంబసీ యోగా సెషన్‌

- January 22, 2016 , by Maagulf
మస్కట్‌లో ఇండియన్‌ ఎంబసీ యోగా సెషన్‌

ఇండియన్‌ ఎంబసీ లాన్స్‌లో జనవరి 18న ఒమన్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ యోగా సెషన్‌ని నిర్వహించింది. ఒత్తిడి నుంచి ఉపశమనానికీ, మెరుగైన జీవనానికీ యోగా ఎంతో ఉపయోగపడ్తుందని ఇర్వాహకులు తెలిపారు. యోగా నిపుణులు, మిడిల్‌ ఈస్ట్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015 పురస్కార గ్రహీత ఇమాన్‌ ముత్లాక్‌ బేసిక్‌ యోగా పోస్చర్స్‌ మరియు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను చేసి చూపించారు. కౌషాని దేశాయ్‌ ఆయుర్వేద పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒడిస్సీ డాన్స్‌ పెర్ఫామెన్స్‌, యోగాపై షార్ట్‌ ఫిలిం ప్రదర్శించారు. పలువురు ఈ యోగా సెషన్‌లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా పట్ల అవగాహన పెరుగుతోంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పించడంతోపాటు, శారీక సమస్యలతో రోగాల బారిన పడకుండా ఉండేందుకు యోగా ఉపకరిస్తుందని ఎన్నో ప్రయోగాలూ స్పష్టం చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com