కువైట్: కరోనా ఎఫెక్ట్ తో స్కూల్స్, థియేటర్స్, హోటల్స్ బంద్..వీసా జారీ నిలిపివేత
- March 10, 2020
కరోనా వైరస్ ను నివారించేందుకు కువైట్ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని రకాల విసాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు కేబినెట్ నుంచి మినిస్ట్రి ఆఫ్ ఇంటిరియర్ కు స్పష్టమైన సూచనలు అందాయి. మళ్లీ అదేశాలు వచ్చే వరకు ఎలాంటి వీసాలు జారీ చేయవద్దని తేల్చి చెప్పింది. అయితే..డిప్లామాటిక్ వీసాలను మాత్రం కొనసాగించనున్నారు. అలాగే జనం గుమికూడా ప్రాంతాల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లకు మార్చి 26 వరకు సెలవులు పొడగించారు. సినిమా థియేటర్లు మూసివేశారు. అలాగే హోటల్స్, బాల్ రూమ్స్, వెడ్డింగ్ హాల్స్ ను కూడా మూసివేయాల్సిందిగా ఆదేశించారు. దేశంలో అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ని రద్దు చేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నిషేధ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







