రాజధానిలో జోన్‌లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్

- March 10, 2020 , by Maagulf
రాజధానిలో జోన్‌లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్

అమరావతి : రాజధానిలో జోన్‌లను మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధానిలో వివిధ అవసరాలకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాల పట్టాల కోసం జోన్‌లను మార్చారు. 967 ఎకరాల 25 సెంట్లు భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లోని భూములను 6 జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కృష్ణాయపాలెం గ్రామంలో రిజర్వ్ జోన్, రీజనల్ సెంటర్ జోన్, వెంకటాయపాలెంలో రీజనల్ సెంటర్, నిడమర్రులో నాన్ పొల్యూటింగ్ జోన్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ జోన్, కురకల్లులో టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, మందడంలో బిజినెస్ పార్క్ జోన్, టౌన్ సెంటర్ జోన్,  నైబర్ హుడ్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఐనవోలు బిజినెస్ పార్క్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లుగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com