కేసిఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం చేసిన మేయర్, కార్పొరేటర్లు

- March 10, 2020 , by Maagulf
కేసిఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం చేసిన మేయర్, కార్పొరేటర్లు

 2020-21 రాష్ట్ర వార్షిక  బడ్జెట్  లో హైదరాబాద్ నగరానికి రూ 10 వేల కోట్ల నిధులు కేటాయించినందుకు సోమవారం  మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జి హెచ్ ఎం సి కార్పొరేటర్లు జి హెచ్ ఎం సి కార్యాలయంలో  ముఖ్యమంత్రి కే సి ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాలలో జి హెచ్ ఎం సి, ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కు  50 వేల కోట్ల రూపాయలు వ్యయమౌతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం  మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ  ఇతర   సాగునీటి ప్రాజెక్టులపై  పెద్ద మొత్తంలో ఖర్చు చేసినందున , అవి దాదాపు పూర్తి అయినందున, ప్రస్తుతం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వం దృష్ఠి సారించినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా  తీర్చి దిద్దెందుకు కారిడార్లు,స్కైవేలు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం,   లేక్స్, సుందరీకరణ పనులతో  పాటు , మురుగునీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు చేపట్టిన పనులు చురుకుగా జరుగుతున్నట్లు తెలిపారు. మూసి ప్రక్షాళన, రెండు వైపులా కారిడార్ల నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో అందిన  డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వివరించారు. మూసీ పరివాహక ప్రాంతమును టూరిస్ట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలను  మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానల సంఖ్యను 350 కు పెంచుతున్నట్టు తెలిపారు. అలాగే పేదల ఆత్మ గౌరవాన్ని పెంచుటకు 60 వేల రెండు పడకల ఇండ్లను కేటాయించుటకు  లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు తెలిపారు.

నగరానికి ఎక్కువ మొత్తంలో రూ 10 వేల కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com