కరోనా వైరస్: దుబాయ్ ఒయాసిస్ మాల్ మూసివేయలేదు
- March 12, 2020
దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్ అయిన ఒయాసిస్ మాల్ కరోనా వైరస్ కారణంగా మూసివేతకు గురయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు మాల్ యాజమాన్యం స్పందించింది. ఇవి ఫాల్స్ రూమర్స్ అని కొట్టి పారేసింది. షాపింగ్ మాల్ యెదుట అంబులెన్స్ ఆగడం, అందులోంచి పారామెడిక్స్ మాల్‌లోకి వెళ్ళడం.. ఇదంతా ఓ వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్ కౌజ్ ప్రాంతంలో మెడికల్ ఎమర్జన్సీ ఏర్పడితే, ఓ వ్యక్తి ఒయాసిస్ మాల్ని ల్యాండ్ మార్క్‌గా రిఫర్ చేశారు. దాంతో, పారామెడిక్స్ తమ డ్యూటీ తాము చేశారు. మాల్‌లోకి పొరపాటున పారామెడిక్స్ వచ్చారు. అంతే తప్ప, మాల్కి ఈ ఘటనకీ ఎలాంటి సంబంధం లేదని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఒయాసిస్ మాల్లో ఇప్పటిదాకా ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదనీ, కరోనా తీవ్రత నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..