సినీ దంపతులకు కరోనా
- March 12, 2020
ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య నటి రిటా విల్సన్ లకు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్ర్టేలియాలోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ కోసం ఆస్ర్టేలియా వెళ్లిన ఈ జంట..కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లగా..అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా నిర్థారణయింది. ఇప్పటికే అమెరికాలో ఈ వైరస్ వల్ల 38 మంది చనిపోగా..టామ్ దంపతులకు కూడా ఈ మహమ్మారి వ్యాపించడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగర్ సీలైన్ డియాన్ తన షో ను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







